Home Latest News పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి మాదిగజాతి రుణపడిఉంటుది.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి మాదిగజాతి రుణపడిఉంటుది.

by Praveen Kumar
0 comments

*నల్ల చంద్ర స్వామి మాదిగఎస్సీ వర్గీకరణ కు అసెంబ్లీ లో ఆమోదం పొందడం మాదిగల పోరాట విజయం.

*మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
స్వీట్ల పంపిణి తో సంభరాలు. *జననేత్రంన్యూస్ ప్రతినిధి మార్చ్19*//:యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (యం) మండల కేంద్రం లో భువనగిరి మోత్కూర్ ప్రదాన రహదారి వద్ద ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో మహా జననేత వర్గీకరణ సాధకుడు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట యోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం, స్వీట్ల పంపిణి సంబరాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాలుగా మహా జననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేసి వర్గీకరణ సాధించడం జరిగింది.
తెలంగాణ అసెంబ్లీలో గౌరవ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు*ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ బిల్లును ఆమోదింప చేయడం గర్వించదగ్గదని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏదేమైనా వర్గీకరణ సాధకుడు మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితంగానే ఈ జాతికి ఫలాలు అందాయని ఫలాలు అందుతున్నాయని అంత గొప్ప మహోన్నతమైన నాయకుడు మందకృష్ణ మాదిగ అని ఆయనకు మాదిగ జాతి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ జాతీ యావత్ మందకృష్ణ మాదిగ అన్నకు రుణపడి ఉందని కొనియాడారు.
ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరులకు జాతీ రుణపడి ఉంటుందని అన్నారు.
అదేవిధంగా గత 30 ఏళ్లుగా మా జాతి ఉద్యమానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు వ్యాపారవేత్తలకు,రాజకీయ నాయకులకు, మానవతావాదులకు, మీడియా పెద్దలకు, సామాజిక వాధులకు మాదిగ దండోరా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ
నాయకులు
మండల ఇంచార్జీ మందుల లింగ స్వామి మాదిగ,
మండల కన్వీనర్ పందుల భిక్షపతి మాదిగ,
మండల నాయకులు గురుకు యాదగిరి మాదిగ,
గంధమల్ల శివశంకర్ మాదిగ, గజ్జెల్లి పవన్ మాదిగ, గంధమల్ల గణేష్ మాదిగ, దుర్గ ప్రసాద్ మాదిగ,బీసి నాయకులు ఆర్ నారాయణ నాయిబ్రాహ్మణ, మైనార్టీ నాయకులు మజీద్ మరియు మల్లయ్య
తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment

12PR Media delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 12PR Media is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird