*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్11*//:గొడ్డుగొరల బుచ్చి రాములు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించి మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఏబీసీలు కాకుండా ఏబిసిడిలు గా వర్గీకరణ జరపాలని అదేవిధంగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేకించి రెండు మంత్రి పదవులు ఇయ్యాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల తొమ్మిదో తేదీ నుండి అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది అని మండల సీనియర్ నాయకులు గొడుగుల బుచ్చిరావుల మాదిగ స్పష్టం చేసినారు ఈరోజు ఖమ్మం రూరల్ మండలం కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మూడవరోజు రిలే నిరాహార దీక్షలను దీక్షాశిపురం లో కూర్చున్న నాయకులు కార్యకర్తలకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించినారు ఈ సందర్భంగా ఈ రిలే దీక్షలు ఉద్దేశించిశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను మొదటి నుంచి మోసం చేస్తూ వంచిస్తూ ముందుకెళ్తుందని అందులో భాగమే గతంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత లేకుండా డీఎస్సీ ఉద్యోగాల నియామకాలు చేపట్టటం అదేవిధంగా నేడు వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించే తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ జీవోకు చట్టబద్ధత లేకుండా మాదిగ మాదిగ ఒప్పుకుళాలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు దాపురించేటట్లుగా చేస్తూ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టటం ఎంతవరకు సమంజసం అని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేలదీసినారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఉంటే ఇప్పటికైనా పునరాలోచించుకొని రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యోగ నియామకాలు వెంటనే రద్దు చేసుకొని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏసీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధతను కల్పించి మాత్రమే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టి మూడు దశాబ్దాల ఉద్యమ పోరాటానికి న్యాయం చేకూరే విధంగా సామాజిక న్యాయం జరిగే విధంగా ముందుకు రావాలని లేని ఎడల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చల్లడం ఖాయమని హెచ్చరించారు రాష్ట్రంలో మాదిగ మాదిగ ఒప్పుకులాల మనోభావాలను అర్థం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని జీవో కు చట్టబద్ధత కల్పించి మాత్రమే ఉద్యోగ నియామకాలకు ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా కోరినారు ఈరోజు దీక్షా శిబిరంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ మహాజన సౌదరిష్టి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తూరుగంటి అంజయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కనకం జనార్దన్ మాదిగ బోయిన కృష్ణ జిల్లా సీనియర్ నాయకులు, పడిశాల వెంకట్ మాదిగ, ఏటుకూరి నరసింహారావు,మహాజన సోషలిస్ట్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు సిరిపురపు బొందయ్య మాదిగ మామిడాల వెంకటేష్ మాదిగ గంటా భీమయ్య మాదిగ గాజుల ప్రసాద్ మాదిగ ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామం నుండి నేటికీ మూడో రోజుగా కొనసాగుతున్న దీక్షలలో భాగంగా గ్రామ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గొడ్డు గొర్ల వసంతరావు మాదిగ గొడ్డు గొర్ల రామకృష్ణ గొడ్డు గొర్ల హరికృష్ణ పాతకోటి సతీష్ గొడ్డు గొర్ల గురు నారాయణ గొడ్డు గొర్లనాగరాజు మాదిగ గొడ్డు గొర్ల ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు



Ceo :P. PRAVEENKUMAR
Adress :zaheerabad
Distic : Sangareddy, Telangana.
Telangana
Cell 6309157787