
పేట 2,3వ వార్డులో మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ముమ్మర ప్రచారం*
ముద్రణ, నారాయణ పేట : కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మంగళవారం పట్టణంలోని 2,3వ వార్డులలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గత బిఆర్ఎస్ పాలన ఎలా ఉందో… ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు సుతారి అరుణ రాంరెడ్డి, కాకర్ల నారాయణమ్మలకు మద్దతుగా నిలిచిన వార్డులో ఇంటింటి ప్రచారం జరిగింది. మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని. మళ్లీ మనం అధికారంలోకి రాబోతున్నామని ఓటర్లతో మాట్లాడుతూ భరోసా కల్పించారు. నారాయణపేట రోడ్డు వైడనింగ్… పార్కుల ఏర్పాటు… మెడికల్ కళాశాల… డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరం ఘనత మన ప్రభుత్వానికే దక్కడం. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సుదర్శన్ రెడ్డి, విజయ్ సాగర్, సలీం అడ్వకేట్, దేవరాజ్, జంగిటి వెంకటేష్, పోషల్ సంతోష్, చెన్నరెడ్డి ఉన్నారు.


